దళితులపై బీజేపీకి చిన్నచూపా?

20
- Advertisement -

దళితులపై బీజేపీ చిన్న చూపు చూస్తోందా ? ప్రస్తుతం అదే ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారుతోందా ? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ.. కొన్ని కులాలవారికే ఎక్కువ ప్రదాన్యం ఇస్తుందనే విమర్శ ఉంది. మతప్రతిపాధికనా హిందువులుగా ఉన్నవారికి ఆ పార్టీలో ఎక్కువ ప్రదాన్యం ఎలాంటి పదవులైనా అధిష్టానం వారికే తక్కబెడుతుందని కమలం పార్టీలోని ఓ వర్గం అప్పుడప్పుడు అసంతృప్తి వెళ్లగక్కుతుంటారు. ఇదిలా ఉంచితే ఇటీవల బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమరాన్ని రెప్పుతున్నాయి..

తాను దళితుడననే కారణంగా అమిత్ షా అవమానించాడని ఆ మద్య చేవెళ్ళలో నిర్వహించిన సభలో తాను శాలువా కప్పబోతే అమిత్ షా నిరాకరించాడని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 70 సంవత్సరాల తరువాత కూడా ఆ పార్టీలో ఇంకా అస్పృశ్యత కొనసాగుతోందని కె చంద్రశేఖర్ చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కాగా మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అయితే కేవలం హిందూ ఓటర్లను మాత్రమే నమ్ముకుంటే బీజేపీకి అధికారం కష్టమే. అన్నీ వర్గాల ప్రజల్లో పార్టీపై సానుకూలత ఉన్నప్పుడీ గెలుపు సాధ్యమౌతుంది. ఈ నేపథ్యంలో దళిత వర్గంపై బీజేపీ వ్యవహరించే తీరు ఆ పార్టీకి ప్రతికూలమే అనేది కొందరు చెప్పే మాట.ఇక వచ్చే నెలలో తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. మరి ఈ జాబితాలో దళిత వర్గానికి కాషాయ పార్టీ ఎంతమేర సీట్ల తేటయింపు జరిపే అవకాశం ఉందనేది ఆసక్తికరమైన అంశం.

Also Read:ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -