ఒక చోట సక్సెస్ అయిన ఫార్ములా ను పదే పదే రిపీట్ చేయడం సర్వ సాధారణం. ఫార్ములా ఎవరిదైనా అందరూ దానిని అమలు చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. ఇటీవల కాంగ్రెస్ కు సక్సెస్ ను తీసుకొచ్చిన ఓ ఫార్ములా ఇతర పార్టీలు కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ఫార్ములా ఏంటంటే మహిళలకు ” ఉచిత బస్సు ప్రయాణం ” కర్నాటక ఎన్నికల వేల కాంగ్రెస్ ప్రకటించిన ఈ హామీకి అన్నీ వైపులా నుంచి విశేష స్పందన లభించింది. మహిళలందరు గంపగుత్తుగా కాంగ్రెస్ కు ఓటు వేయడంలో ఈ హామీ ప్రభావమనే చెప్పాలి. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ హామీని అమలులోకి కూడా తీసుకొచ్చింది. దీంతో కర్నాటకలో సక్సెస్ అయిన ఈ హామీని ఏపీ టీడీపీ కాపీ కొట్టడమే కాకుండా ఆ పార్టీ మినీ మేనిఫెస్టోలో కూడా చేర్చింది.
Also Read: CMKCR:మార్చుకోవాల్సిన సమయం వచ్చింది
దీంతో టీడీపీ ప్రకటించిన ఈ హామీకి కాపీ అనే ముద్రా పడుతున్నప్పటికి మహిళలలు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు. దీంతో ఏపీలోని వైసీపీ, జనసేన పార్టీలు కూడా ఈ హామీని కొద్దిగా మార్పులు చేర్పులు ఆ పార్టీల మేనిఫెస్టోలో కూడా చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం జపం చేస్తోంది. ఇక్కడ కూడా ఆ హామీని అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం బర్నింగ్ టాపిక్ గా మారింది. అయితే కర్నాటకలో సక్సెస్ అయిన ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం, రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతవరకు అమలౌతుంది అనేది ప్రశ్నార్థకమే. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో తెగ హడావిడి చేస్తున్న ఈ పథకం కేవలం ఎన్నికల హామీ గానే మిగిలిపోతుందా లేదా అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.
Also Read: విపక్షాలే టార్గెట్.. అదంతా షా వ్యూహమే !