రాజస్థాన్ ఎలక్షన్స్ .. కాంగ్రెస్ భయం!

49
- Advertisement -

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారాలు నిర్వహించాయి. ఈసారి రాజస్థాన్ లో కాంగ్రెస్ కు చెక్ పెట్టి తాము అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారం సాధించి హిస్టరీ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రాజస్తాన్ లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు పార్టీలకు కూడా కీలకం కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. 200 స్థానాలకు గాను 101 సీటు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది..

ప్రస్తుతం ఇరు పార్టీలు కూడా బలంగా ఉండటంతో విజయాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు తక్కువగా ఉన్న కాంగ్రెస్ బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించింది. కానీ ఈసారి పరిస్థితులు చాలానే మారిపోవడంతో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. దాంతో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య పోటీ తార స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకత తో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి బలం పెరిగే అవకాశం లేకపోలేదు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే గత 30 ఏళ్లలో అక్కడి ప్రజలు ఏ పార్టీకి రెండో సారి అధికారాన్ని కట్టబెట్టలేదు. ఆ రకంగా చూసుకున్న కూడా కాంగ్రెస్ కు ఓటమి తప్పదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ కరువవడంతో అటు రాజస్థాన్ లోనూ ఇటు తెలంగాణలోనూ డిసెంబర్ 3 న హస్తం పార్టీకి భారీ షాక్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ,మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:మన్సూర్ క్షమాపణపై త్రిష స్పందన ఇదే

- Advertisement -