Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!

43
- Advertisement -

వశిష్ట దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాని భారీ స్థాయిలో చేయబోతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మెగాస్టార్ పై యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి లుంగీలో ఊర మాస్ లుక్‌లో కనిపిస్తాడట. చిరంజీవి ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్స్ కొట్టాయి. అందువలన అదే నేపథ్యంలో దర్శకుడు వశిష్ట ఓ ఫ్లాష్ బ్యాక్ ను కూడా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

పైగా కొన్ని పీరియాడిక్ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ కూడా ఉంటుందని టాక్. చిరంజీవికు జోడీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో త్రిష నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ తో పాటు సంజయ్ దత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూస్తుంటే.. చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో హిట్ రావడం గ్యారెంటీ అనిపిస్తోంది.

పైగా ఈ సినిమాలో మెగాస్టార్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. చిరు వంద కోట్ల మార్క్ ను దాటాడు. కాబట్టి.. మెగాస్టార్ కి కరెక్ట్ సినిమా పడితే 200 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు మేకర్స్.

Also Read:రాజస్థాన్ ఎలక్షన్స్ .. కాంగ్రెస్ భయం!

- Advertisement -