కాంగ్రెస్ ను జేడీఎస్ నమ్మట్లేదా ?

48
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కర్నాటక రాజకీయాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఈసారి కన్నడనాట జెండా పాతే పార్టీ ఏది అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అయితే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనున్న నేపథ్యంలో గెలుపు ఏకపక్షంగా సాగడం కష్టమే. ఎందుకంటే మూడు పార్టీలు కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయా సర్వేలు మరియు విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండడంతో హంగ్ ఏర్పడితే.. జేడీఎస్ పార్టీ కీలకంగా మారే ఛాన్స్ ఉంది. .

ఎందుకంటే జేడీఎస్ పార్టీ దాదాపు 30 నుంచి 40 స్థానాలలో గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఈ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని స్థాపించాల్సి ఉంటుంది మిగిలిన రెండు పార్టీలు. దాంతో జేడీఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది.. జేడీఎస్ ఎలాంటి డిమాండ్లను తెరపైకి తెస్తుందనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా ఈ పొత్తు అంశాలపై ఇటీవల జేడీఎస్ అధినేత హెచ్.డి దేవగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో హంగ్ ఏర్పడితే జేడీఎస్ మద్దతు బీజేపీకేనా అనే సందేహాలు రాక మానవు. ఇక జేడీఎస్ తో పొత్తు కోసం ఏం ఐ ఏం, ఎన్సీపీ వంటి పార్టీలు గట్టిగా ప్రయత్నించాయి.

Also Read: కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టే అభ్యర్థి ఎవరు ?

కానీ జేడీఎస్ మాత్రం ఏ పార్టీతో కలిసి నడిచే ప్రసక్తే గతంలోనే స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా పొత్తుకు నో అనడంతో హంగ్ ఏర్పడితే జేడీఎస్ బీజేపీతో కలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజావ్యతిరేకత గట్టిగానే ఉంది. దాంతో ఈసారి బీజేపీ గెలవడం కష్టమనే సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికి వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని కమలనాథులు ధీమాగా ఉన్నారు. జెడిఎస్ తో పొత్తు కుదిరే అవకాశం ఉందనే ఆలోచనతోనే కమలనాథులు అధికారంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది కొందరి వాదన. మరి ఒకవేళ హంగ్ ఏర్పడితే.. బీజేపీ.. జేడీఎస్ కలిస్తే కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి.

Also Read: నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

- Advertisement -