రెండోరోజు… కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్

25
congress

కాంగ్రెస్ పార్టీ పటిష్టతలో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్‌లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ నేతలందరితో రాహుల్ సమావేశం కానుండటం భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు, దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు.

ఇక రాబోయే ఎన్నికల్లో ఒకే కుటుంబానికి ఒక టికెట్ అనే దానిపై ప్రధానంగా జర్చజరగనుంది. అయితే దీనిపై కొంతమంది సీనియర్లు పెదవి విరుస్తున్నారు.