ఆ పని ఎప్పటికీ చేయను: విశ్వక్ సేన్‌

74
vishwak
- Advertisement -

ప్రేక్షకులు బాధపడే పని ఎప్పటికి చేయనని తెలిపారు హీరో విశ్వక్ సేన్. ఖమ్మంలో అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వక్ సేన్… సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో పాటు బలమైన కథ, సంగీతం, పాటలు సమపాళ్లలో ఉంటాయన్నారు.

నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయం అన్నారు. వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని యువకుడైన అల్లం అర్జున్‌కుమార్‌ పడే బాధలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందన్నారు.

విద్యాసాగర్‌ చింత దర్శకత్వంలో విశ్వక్‌ సేన్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ఈ సినిమా 6న విడుదల కానుంది. విద్యాసాగర్‌ చింత, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, రుక్సార్‌ థిల్లాన్, చిత్ర కథారచయిత, షో రన్నర్‌ రవికిరణ్‌ కోలా, సంగీత దర్శకుడు జై క్రిష్‌ తదితరులు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

- Advertisement -