తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలె టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన రోహిత్ రెడ్డి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పరిషత్ ఎన్నికలు ముగియడంతో ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ సమక్షంలో రోహిత్ రెడ్డి పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో విభేదాల కారణంగా టీఆర్ఎస్ నుంచి ఏడాది క్రితం బహిష్కరణకు గురయ్యారు రోహిత్ రెడ్డి. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన మహేందర్ రెడ్డిపై గెలిచారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రోహిత్ టీఆర్ఎస్‌లో చేరనుండటం కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది.
ఇక ఇప్పటికే నల్గొండ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి …హుజుర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా పైలట్ రోహిత్ కూడా కాంగ్రెస్‌ను వీడనుండటంతో పార్టీ బలం మరింత తగ్గనుంది. దీంతో దాదాపుగా టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ ఎల్పీ వీలినానికి మార్గం మరింత సుగుమం అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.