నా చావుతోనే స్పందిస్తారా?..ఎమ్మెల్యే సంచలనం

2
- Advertisement -

తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తన ప్రాణం విలువ రూ.40 కోట్లా? లేక తనను బతికించాలా? అన్నది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.

నేను చనిపోతానంటేనే బిల్లులు వస్తాయంటే.. చావడానికి అయినా సిద్ధం. నా చావుకి రూ.40 కోట్లు విలువనా? లేక నేను బతికి ఉండాలా? అనేది ప్రభుత్వం నిర్ణయించాలి. నా చావుతోనే స్పందిస్తారా? అంటూ అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని వాటికి సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:రెడ్ ఫ్లాగ్ ట్రోలింగ్‌పై విజయ్

రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల పనులు పూర్తి కాకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన చేపడతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. పెండింగ్ బిల్లుల అంశంపై ప్రభుత్వం స్పందించి, రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -