దివంగత సాధువులతో సంభాషణలా?

5
- Advertisement -

దివంగత సాధువును కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించి ఆయనతో మాట్లాడుతున్నట్లు చూపిస్తూ ఆశీస్సులు తీసుకోవడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మత విశ్వాసాలను ఉపయోగించుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు.

కేరళకు చెందిన ఎప్పుడో మరణించిన ఓ సాధువును AI సాంకేతికతతో డిజిటల్ రూపంలో సృష్టించి ఆయనతో సంభాషిస్తున్నట్లుగా చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రకాష్ రాజ్.. కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల విశ్వాసాలను ఆసరాగా చేసుకుంటున్నారని విమర్శించారు. సాంకేతికతను ఇలాంటి పనులకు ఉపయోగించడం దాని దుర్వినియోగమేనని అభిప్రాయపడ్డారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన ‘క్లౌడ్ థియరీ’ వంటి అంశాలను గుర్తుచేస్తూ ప్రకాష్ రాజ్ ప్రశ్నలు సంధించారు. ఇప్పుడు మరణించిన సాధువులతో AI ద్వారా సంభాషణలు జరిపినట్లు చూపించడం ఏమిటని నిలదీశారు. ప్రజల మతపరమైన భావోద్వేగాలను ప్రభావితం చేసేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ

- Advertisement -