నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న ఇటీవల ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో పాల్గొన్నారు. ఈ షోలో తమ ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత విజయ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రష్మిక పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన విషయాన్ని విజయ్ వివరించిన తీరు చర్చనీయాంశమైంది. కొందరు నెటిజన్లు విజయ్‌ని రెడ్ ఫ్లాగ్ అంటూ ట్రోల్ చేశారు.
కరణ్ జోహార్ షోలో రష్మిక మాట్లాడుతూ.. తానే మొదట విజయ్‌ను పెళ్లి చేసుకుందామని అడిగినట్లు వెల్లడించింది. మనం పెళ్లి చేసుకుందాం అని తాను చెప్పగా విజయ్ …సరే.. నువ్వు నన్ను వందసార్లు అడుగు అని సమాధానమిచ్చినట్లు వివరించింది. దాదాపు ఏడాది పాటు తాను విజయ్‌ను పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నానని రష్మిక చెప్పింది.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు విజయ్‌పై విమర్శలు చేశారు. భార్యను అందరి ముందు ఇబ్బందికి గురిచేశాడని, అతడి ప్రవర్తనలో అహంకారం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. విజయ్ తన వైఖరిని వివరిస్తూ.. పెళ్లి వంటి కీలక నిర్ణయాన్ని కేవలం క్షణికావేశంలో తీసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఇద్దరికీ కష్టసమయాలు ఎదురైనప్పటికీ తమ బంధంపై అదే నమ్మకం, ఇష్టం కొనసాగుతాయా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నట్లు వివరించాడు.
Also Read:FMCG:సామాన్యులకు మరో షాక్..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గీత గోవిందం , డియర్ కామ్రేడ్, రణబాలి చిత్రాల్లో నటించారు.

