రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఇండియా కూటమిని ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న తరచూ వేధిస్తూనే ఉంది. ఎన్డీయే కూటమి తరుపున నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా కొనసాగుతుండగా, ఇండియా కూటమిలో మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కూటమిలో చాలా మంది నేతలు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, శరత్ పవార్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంది. గతంలో మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ వంటి వారు కూడా కూటమి తరుపున ప్రధాని రేసులో ఉండేవారు కానీ వారు కూటమి నుంచి బయటకు రావడంతో ప్రస్తుతం కూటమిలోని వారి మద్యే పోటీ కోన సాగుతోంది. అయితే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారా ? లేదా అనే ప్రశ్నలు తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి .
ఈ విషయంపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల గెలిచిన తరువాతే ప్రధాని అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం సాధిస్తుందా ? అనే సంగతి పక్కన పెడితే ప్రధాని అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిని ప్రకటించకుండా.. ఎన్నీకాల్లో గెలిచిన తరువాత సిఎం అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్.
సేమ్ అదే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూటమి తరుపున పిఎం అభ్యర్థి ఎంపిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కూటమిలో అంతర్గత కుమ్ములాటలకు తావుండదనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం వల్ల అనిశ్చితి ఏర్పడి నేతల మద్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఎన్నికల్లో గెలిచిన తరువాత పిఎం అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం తీసుకోవడం బెటర్ అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల ప్రజల్లో స్పష్టత కొరవడుతుంది. మరి ఈ లోపాన్ని ఇండియా కూటమి ఎలా అధిగమిస్తుందో చూడాలి.
Also Read:రష్మిక బర్త్ డే..ది గర్ల్ ఫ్రెండ్