కాంగ్రెస్ మేనిఫెస్టో.. బీజేపీకి షాక్ !

40
- Advertisement -

కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు కూడా విజయావకాశాలు సమానంగా ఉండడంతో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం రెండు పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో ఉంటూనే.. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకరినిమించి మరొకరు మేనిఫెస్టోలు విడుదల చేస్తూ పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. నిన్న బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయగా.. నేడు కాంగ్రెస్ పార్టీ అంతకు మించి అనేలా మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. .

హస్తం పార్టీ ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించి కొత్త చర్చలకు తావిస్తోంది. గ్రామీణ రైతులకు ఎనిమిది గంటల ఉచిత కరెంటు, గృహ జ్యోతి యోజన కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, అన్నాభాగ్య యోజన కింద 10 కిలోల బియ్యం, నిరుద్యోగ గ్యాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3000 వేలు భృతి,. ఇలా ఎన్నో అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించింది హస్తం పార్టీ. అయితే బీజేపీ టార్గెట్ గా పలు చట్టాల అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చడమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ, బీజేపీ చేసిన ప్రజా వ్యతిరేక చట్టాల ఉపసంహరణతో పాటు.. భజరంగ్ దళ్, పిఎఫ్ఐ వంటి మత సంబంధిత సంస్థలను పూర్తిగా నిషేధిస్తామని మేనిఫెస్టోలో చెప్పడంతో రాజకీయ వేడి రగులుకుంది.

Also Read: పాక ఇడ్లీ తిన్న వెంకయ్య..అద్భుతం అంటూ కితాబు

భజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థల వల్ల మత విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని, మతసమానత్వం కొరకు ఆ సంస్థలను రద్దు చేయడం మంచిదని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన ఈ అంశం పై కమలనాథులు మండిపడుతున్నారు. భజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు మతప్రాతిపాదికనా బీజేపీకి అనుకూలంగా పని చేస్తాయనేది జెగమరిగిన సత్యం. అందువల్ల వీటిని నిషేదిస్తే బీజేపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అయితే భజరంగ్ దళ్, పిఎఫ్ఐ సంస్థల నిషేదాన్ని మేనిఫెస్టోలో చేర్చడం వల్ల కర్నాటకలో అధిక శాతం ఉన్న లింగాయత్ ఓటర్లు ఎలా స్వాగతిస్తారో అనేది చూడాలి.

Also Read: ఏపీకి కే‌సి‌ఆరే దిక్కు !

- Advertisement -