గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరూర్ నగర్ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ యాదవ్ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి సబితారెడ్డి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అనిత దయాకర్ రెడ్డి మరియు ఇతర టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అలాగే సరూర్నగర్ డివిజన్‌లో సిపిఐ మరియు ఇతర పార్టీల నుండి భారీ ఎత్తున టీఆర్‌ఎస్ కడువా కప్పుకున్నారు. సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి విజయ భారతిని గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
