చైనా భారత్‌పై యుద్ధానికి దిగితే బీజేపీ ప్రభుత్వం నిద్రలోకి జారుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం నిజనిజాలను తెలియ పర్చకుండా దాచిపెడుతోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో వందో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజస్ధాన్‌లోని జైపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ కాషాయ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
China is preparing for war, Centre hiding it: Rahul Gandhi
Read @ANI Story | https://t.co/YnFbyhJOca#RahulGandhi #China #BharatJodaYatra #Congress pic.twitter.com/ODlkDWOLaA
— ANI Digital (@ani_digital) December 16, 2022
భారత్-చైనా సరిహద్దు వివాదం విషయంలో తలెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లడఖ్ అరుణాచల్ వైపున డ్రాగన్ కవ్వింపు చర్యలను నిలవరించలేకపోయిందంటూ ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారులు పార్టీ వెన్నంటే ఉన్నారని చెప్పారు. బీజేపీ విజన్‌తో కాంగ్రెస్ దీటుగా పోటీ పడాలని, కాంగ్రెస్ తన స్వభావాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగడం కీలకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి…
అమితాబ్ కామెంట్స్ పై రచ్చ
టీటీడీ మండలి సభ్యుడిగా దాసరి కిరణ్
నడ్డా..తెలంగాణ మనసు గెలుచుకో..