దిల్ రాజు కొత్త దుకాణం

101
- Advertisement -

టాలీవుడ్ లో చిన్న డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు మరో బేనర్ ను స్టార్ట్ చేశారు. దిల్ సినిమాతో మొదలైన రాజు కెరీర్ ఇప్పుడు 50 సినిమాల వరకూ చేరింది. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ కాకుండా దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటూ చిన్న సినిమాలను తీసేందుకు రెడీ అవుతున్నారు దిల్ రాజు. ఈ బేనర్ లో మొదటి సినిమాగా ‘బలగం’ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాతో కమెడియన్ నల్ల వేణు దర్శకుడిగా మారబోతున్నాడు.

తాజాగా బలగం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలంగాణా నేపథ్యంలో కరీం నగర్ లో జరిగే కథతో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో దిల్ రాజు నెక్స్ట్ జెనరేషన్‌ నుండి హర్షిత్ రెడ్డి , హన్శిత రెడ్డి నిర్మాతలుగా లాంచ్ అవ్వబోతున్నారు. ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ బేనర్ కి ఓ బొమ్మరిల్లు , శతమానం భవతి అవుతుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు.

ఇకపై దిల్ రాజు ప్రొడక్షన్స్ నుండి బలగం లాంటి కాన్సెప్ట్ సినిమాలు రాబోతున్నాయి. బలగం తో మొదలైన చిన్న సినిమాల నిర్మాణం ఇలాగే కొనసాగనుంది. మరి తొలి నిర్మాణం హర్షిత్ రెడ్డి , హన్షితకి నిర్మాతలుగా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

అమితాబ్ కామెంట్స్ పై రచ్చ

పిక్ టాక్ : బ్లాక్ డ్రెస్ లో గ్లామరసం

తల్లితండ్రులు కాబోతున్న అట్లీ–ప్రియా

- Advertisement -