KTR సమక్షంలో BRSలోకి బీల్యా నాయక్

48
- Advertisement -

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత బీల్యా నాయక్. తెలంగాణ భవన్‌లో తన అనుచరులు వందలాది మంది సమక్షంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి తనకు డబ్బులు సంపాదించే ఏటీఎంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు అంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు… నోటుకు సీటు అంటూ… రేటెంత అంటూ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఫేక్ సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ… తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆ పార్టీకి కొత్త కాదు.. గతంలో కూడా ఇలాంటి సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతాం.. గడ్డాలు గీసుకోమంటూ సవాలు చేసిన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట తప్పారు అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నా కరెంటు ఇయ్యలేని సన్నాసులమని కాంగ్రెస్ ఓటు అడుగుతుందా…60 ఏళ్లు అధికారంలో ఉన్నా తాగునీటి ఇబ్బందులు తీర్చలేని చేతగాని వాళ్ళమంటూ ఓటు అడుగుతారా అని ప్రశ్నించారు.

Also Read:ఆదికేశవ…హే బుజ్జి బంగారం రిలీజ్

24 గంటల కరెంటు రైతులకు ఇవ్వలేని ఆలోచన మాకు రాలేదు అని ఓటు అడుగుతారా…కాంగ్రెస్ కి ఓటు ఎందుకు వేయ్యాలో చెప్పాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతల ఎదిగారు కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని…60 ఏళ్ల పాటు ప్రజలకు ఏం చేయని కాంగ్రెస్ పార్టీని మరోసారి ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన వేలుతో మన కండ్లని పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ జమానాలో ఉన్న కరెంటు కోతలు, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరత వంటి దుర్భర పరిస్థితిలు మళ్లీ కావాలా అని ప్రశ్నించారు.దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బిల్యా నాయక్ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంత కావడం ఖాయం అన్నారు.

Also Read:చంద్రబాబు కు బెయిల్.. రెడీ?

- Advertisement -