కర్నాటక ఎన్నికల్లో గెలుపు తరువాత ముఖ్యమంత్రి ఎంపిక పై తర్జన భర్జన పడుతున్న కాంగ్రెస్ ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సిఎం సిద్దరామయ్య మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సిఎం పదవి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసి అవినీతి రహితుడిగా పేరు గడించాడు సిద్దరామయ్య. అంతే కాకుండా ప్రజల్లో కూడా తిరుగులేని ఆధరణ సిద్దరామయ్యకు ఉంది. ఇక మెజారిటీ ఎమ్మేల్యేలు కూడా సిఎంగా సిద్దరామయ్యనే కోరుకున్నారు.
దీంతో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకే సిఎం పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3:30 నిముషాలకు కర్నాటక సిఎం గా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే పార్టీ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ను అధిష్టానం పక్కన పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. డీకే శివకుమార్ అక్రమ ఆస్తుల విషయంలో కేసులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా సిద్దరామయ్యతో పోల్చితే ప్రజాధరణ కూడా తక్కువే.
Also Read: సిఎం పదవి ఇవ్వకపోతే.. డీకే రాజీనామా ?
అలాగే దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి.. ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ కు సిఎం పదవి ఇవ్వలేదని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి. అయితే సిఎం పదవి ఇవ్వండి లేదంటే ఏ పదవి వద్దని భీష్మించుకు కూర్చున్నా డీకేను రాహుల్ గాంధీ బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో రెండు మంత్రి పదవులను డీకే శివకుమార్ కు ఆఫర్ చేసిందట అధిష్టానం. అంతే కాకుండా రెండేళ్ళు సిద్దరామయ్య మూడేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేలా ఇద్దరికీ సమన్యాయం చేసేటట్లుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి గత మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్నాటక సిఎం ఎవరనే క్వశ్చన్ కు నేడు అధిష్టానం తెరదించింది.
Also Read: సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..