ఆ మాజీ సీఎం వ్యాఖ్యలు బండికి కరెక్ట్‌గా సూట్ అవుతాయి..!

69
bjp

దేశంలో కాషాయ నేతలు మతోన్మాదులుగా మారి రెచ్చిపోతున్నారు. హిందూత్వ అజెండాతో రాజకీయాలు చేసే బీజేపీ నేతలు ఆరెస్సెసె, భజరంగ దళ్, హిందూ సేన వంటి హిందూత్వ సంఘాలతో కలిసి దళిత, గిరిజన, బడుగు, మైనారిటీ వర్గాలపై దాడులకు పాల్పడుతున్నారు. కరడుగట్టిన కాషాయ నేతలు మతం పేరుతో చేస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దేశంలో జైశ్రీరామ్, వందేమాతరం అనకుంటే దేశద్రోహులుగా ముద్రలు వేసి దాడులకు పాల్పడుతున్న స్థితి నెలకొంది.

మనువాదస్మృతిని పాటించే కాషాయనేతలు మహిళలపై లైంగిక వివక్ష చూపిస్తూ…వారి వస్త్రధారణపై ఆంక్షలు పెడుతూ నయా తాలిబన్లలా వ్యవహరిస్తున్నారు. ‎ఇదే విషయంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ…బీజేపీ నేతలను తాలిబన్లతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఆర్ గుండూరావు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాషాయ నేతల మతోన్మాదాన్ని తీవ్రంగా విమర్శించారు. సబ్‌ కా సాత్..సబ్ కా వికాస్ అని చెప్పే మోదీ తన కేబినెట్‌లో క్రైస్తవులు, ముస్లింలకు చోటు కల్పించలేదని ధ్వజమెత్తారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నా సంఘ్ పరివార్ నేతలే పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్‌లో హిట్లర్ జన్యువులు ఉన్నాయని , వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. అబద్ధాలు సృష్టించటం, అదే రీతిలో మార్కెటింగ్ చేయడం బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని, కాషాయ నేతలు తాలిబన్లలా మారి నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిద్ధరామయ్య హెచ్చరించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణలో బరాబర్ మతవిద్వేషాలు రగిలిస్తాం..మాది హిందువుల పార్టీనే అంటూ హిందూ, ముస్లింల మధ్య వైషమ్యం పెంచుతున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పకకా కాషాయ తాలిబన్ అని నెట్‌జన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలను తాలిబన్లు అంటూ కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రంలో పెనుదుమారం రేపుతున్నాయి.