లక్ష్మణుడి అలక..బండిలో కలవరం..!

138
laxman
- Advertisement -

తెలంగాణ బీజేపీలో మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యవహారం మిస్టరీగా మారింది. గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అసలేం జరుగుతుందని కాషాయ క్యాడర్ గందరగోళంలో పడిపోయింది. బండి సంజయ్ రాకతో కాషాయ పార్టీలో సీనియర్ నేతల ప్రాభవం తగ్గిపోయింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలుగా చీలిపోయింది. వచ్చే సారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కమలనాథులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. దీంతో సీఎం కుర్చీపై బండి, కిషన్ రెడ్డిలతో సహా కీలక నేతలు కన్నేశారు. కాగా పాత అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీని బలోపేతం చేసినా…టీఆర్ఎస్ ప్రభుత్వంపై అగ్రెస్సివ్‌‌గా వ్యవహరించలేదని విమర్శలు ఉన్నాయి. కిషన్ రెడ్డిలా లక్ష్మణ్ కూడా తన హయాంలో హుందాగా వ్యవహరించారు. కేసీఆర్ సర్కార్‌పై సైద్దాంతికపరమైన విమర్శలు చేసేవారు తప్పా..ఏనాడు వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు. అదే ఆయనకు మైనస్‌గా మారి బండి లాంటి వదరుబోతు నాయకులకు అధ్యక్ష పదవి వచ్చేలా చేసింది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత లక్ష్మణ్ వర్గాన్ని వ్యూహాత్మకంగా పక్కనపెట్టారు. తనతో సీఎం పదవికి పోటీపడుతున్న కిషన్ రెడ్డికి లక్ష్మణ్ సన్నిహితంగా ఉంటారని బండి సంజయ్‌కు కోపం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీతో తమకు పొత్తు అక్కర్లేదని, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశాడు. దీంతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి సర్ది చెప్పడంతో జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఈ ఎపిసోడ్‌లో లక్ష్మణ్ పాత్రపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడంట. మరోవైపు జీ‌హెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో తన వర్గానికి టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి చేరిన వారికి బీఫారమ్‌లు ఇవ్వడంపై లక్ష్మణ్ బండి సంజయ్‌ ‌ను నిలదీశాడంట.అప్పటి నుంచి ఇరువురి నేతల మధ్య కోల్డ్ వారు నడుస్తుందంట.. కావాలనే తన వర్గాన్ని తొక్కేస్తున్నాడని బండిపై లక్ష్మణ్ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారంట. అయితే రాష్ట్రంలో బండి నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధించడంతో అధిష్టానం కూడా ఈ విషయంలో సైలెంట్ అయిందంట.

ఈ క్రమంలో పార్టీలో లక్ష్మణ్‌ను పక్కనపెడుతున్నారంట.. పార్టీ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందడం లేదంట…బండి పాదయాత్రలో కూడా లక్ష్మణ్ పెద్దగా కనిపించడం లేదు. కాగా బండి సంజయ్, లక్ష్మణ్‌లు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇక పాదయాత్రలో బరాబర్ మత విద్వేషాలు రగిలిస్తామంటూ బండి చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారంట..హిందూత్వ అజెండాతో కిషన్ రెడ్డి, మేము ఇన్నాళ్లు రాజకీయం చేశాం..కాని మైనారిటీలను కూడా కలుపుకుని పోయాం..అందుకే మైనారిటీలు అధికంగా ఉండే అంబర్‌పేట్, ముషీరాబాద్‌లలో కూడా కాషాయ జెండా ఎగరవేశాం..ఎన్నడూ లేనిది మతవిద్వేషాలు రగిలిస్తామంటూ ముస్లింలను టార్గెట్ చేయడం ఏంటీ…ఇదేమి వైపరిత్యం అని లక్ష్మణ్ పార్టీ అంతర్గత సమావేశాల్లో బండి తీరుపై నిరసన వ్యక్తం చేశారంట..బండి సంజయ్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో ఇక తన మాటలు వినేవారు లేరని తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్ పార్టీ క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంట…మొత్తంగా తెలంగాణ బీజేపీలో మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యవహారం
మిస్టరీగా మారింది. త్వరలోనే బండి సంజయ్‌‌ తీరుకు నిరసనగా బీజేపీని వీడినా చేరినా ఆశ్చర్యం లేదని కాషాయ పార్టీలో చర్చ జరుగుతుందంట… మరి లక్ష్మణ్ వ్యవహారంలో బండి సంజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -