- Advertisement -
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీ చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నట్లు గతంలోనే తెలిసిందే. వైద్య పరీక్షలు ముగించుకోని ఇటలీలోని తన తల్లిని చూడటానికి వెళ్తారని జైరామ్ రమేష్ తెలిపారు. సోనియా గాంధీ వెంట రాహుల్, ప్రియాంక వాద్రాలు కూడా వెళ్తారని తెలిపారు. అయితే ఏ దేశంలో వైద్య పరీక్షలు చేయించుకుంటారనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. కానీ దిల్లీకి వచ్చేముందు సోనియా తన తల్లిని కలిసి వస్తారని జైరాం రమేష్ వెల్లడించారు. కానీ ఇంతలోనే సోనియా తల్లి మరణించారు.
- Advertisement -