Congress:ఆ రాష్ట్రాల్లో కూడా డౌటే?

47
- Advertisement -

ప్రస్తుతం ఎన్నికల దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి గట్టిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్, వ్నతి రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది తెలంగాణ మాత్రమే. ఇక్కడ కూడా మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ సత్తా చాటబోతోంది అనే క్యూరియాసిటీ దేశ రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ మరియు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ మిజోరాం, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పార్టీల హవా కొనసాగుతోంది. .

అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి అధికారమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కలవర పెడుతున్నాయి. రాజస్థాన్ లో ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పటికి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు వ్యతిరేకత చూపుతూ వచ్చారు. దాంతో ఈసారి రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ కోట కూలడం ఖాయంగా కనిపిస్తోందనేది కొందరి అంచనా.

అలాగే మధ్యప్రదేశ్ లో గత ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకున్నప్పటికి అధికారం మాత్రం బీజేపీ ని వరించింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలిచి అధికారం సాధించాలని చూస్తున్న హస్తం పార్టీకి నివేధికలు కలవర పెడుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ కు ప్రతికూలంగా సర్వేలు వస్తుండడం గమనార్హం. ఇక ఛత్తీస్ గఢ్ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు తెలంగాణలో అసలు హస్తం ఊసే లేని విధంగా పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు లేదా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ అధికారం ఉన్న రాష్ట్రాలు కూడా చేజారిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read:రైతు బంధును ఆదరించండి..రైతు రాబంధును తరిమికొట్టండి

- Advertisement -