ఎలక్షన్ ఎఫెక్ట్ : ఆరు గ్యారెంటీల అమలు కష్టమేనా?

21
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తీసుకురాగా మిగిలిన నాలుగు హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఆల్రెడీ హామీల అమలు దిశగా ప్రజాపాలన పేరుతో ధరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల కారణంగా హామీల అమలు కు అడ్డంకి ఏర్పడనుందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆ తరువాత కొత్త పథకాల అమలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు జరిగేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే హామీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుందా లేదా ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తరువాత వాటి అమలు గురించి ఆలోచిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మహిళలకు ప్రతి నెల రూ. 2500, వంట గ్యాస్ రూ.500, ప్రతికుటుంబానికి 200 యూనిట్ల కరెంట్, రైతు భరోసా, యువ వికాసం.. ఇవన్నీ కూడా అమలు కావాల్సిఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా హామీలనే కాంగ్రెస్ ప్రకటించింది. ఆ హామీలన్నిటిని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగనుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ హామీల అమలు ఎలాంటి పరిమితులు లేకుండా అమలౌతాయా ? లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా వ్యవహరిస్తుదో చూడాలి.

Also Read:ఆ వీడియోకి కృతి సనన్ ఫేస్ పెట్టారు

- Advertisement -