కాంగ్రెస్ పార్టీకి కార్తీక్ రెడ్డి రాజీనామా..

234
karthik reddy
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కార్తిక్ రెడ్డి మొద‌టి నుంచి రాజేంద్ర‌న‌గ‌ర్ టికెట్ ఆశించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆస్ధానంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కార్తీక్ రెడ్డికి నిరాశే ఎదురైంది. మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా రాజేంద్ర‌న‌గ‌ర్ ను టీడీపీకి కేటాయించారు. దింతో ఆయ‌న నేడు త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసిన త‌ర్వాత ఆయ‌న ఈనిర్ణ‌యం తీసుకున్నారు.

karthik

ఈసంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి స‌వాల్ విసిరారు. రాజేంద్రనగర్ సీటిస్తారో లేక తన రాజీనామా ఆమోదిస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీకి రాజీనామా చేస్తారని హెచ్చరించారు. త‌న‌తో పాటు ప‌లువురు ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మహాకూటమి పేరిట టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రెబ‌ల్ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగ‌నున్నట్లు స‌మాచారం.

- Advertisement -