కండోమ్… ధరెంతో తెలిస్తే షాకవుతారు?

205
Venezuela
- Advertisement -

ఎయిడ్స్, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భాన్ని నివారణకు కండోమ్‌ల వాడకం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో ప్రభుత్వాలే స్వయంగా కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి. అయితే వెనిజులాలో మాత్రం కండోం ధర తెలిస్తే ఖచ్చితంగా షాకవుతారు.

ఏకంగా ఒక కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ.60వేలు. ఈ రేంజ్‌లో కండోమ్‌ ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలే. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. ఆ దేశంలో చట్టవిరుద్ధ అబార్షన్లు చేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. దీంతో జనాలు పెద్ద ఎత్తున కండోమ్‌లు కొనుగోలు చేస్తున్నారు. కండో మ్ లకు భారీ డిమాండ్ ఉండటంతో రేట్లను పెంచేశారు.

దీనిపై స్ధానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. కండోమ్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -