ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం..

176
GHMC
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి నామినేషన్లను అధికారులకు సమర్పించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముఖ్యనేతలు, శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థులతో జోనల్‌ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి.

నిన్నటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి రోజు అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. మొత్తం నామినేషన్ల సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ 26 మంది సిట్టింగ్‌లను మార్చగా, బీజేపీ 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 69 డివిజన్లలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.

- Advertisement -