తమిళనాడు గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు..

189
- Advertisement -

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరుపై రాష్ట్రపతికి ద్రౌపదీముర్ముకు ఫిర్యాదు చేశారు డీఎంకే పార్టీ, దాని మిత్ర పక్ష ఎంపీలు. శాంతి భద్రతలకు ఆయన్నొక ముప్పుగా పరిణమించారంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు.

మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారంటూ మెమోరాండమ్‌లో రాష్ట్రపతికి ఫిర్యాదుచేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, చట్టాన్ని పరిరక్షిస్తానని చేసిన ప్రమాణాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఉల్లంఘించారన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కావాలనే జాప్యం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఆయన చేస్తున్న ప్రకటలను.. ఒకరంగా దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చు అన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవికి ఆయన అనర్హుడని….గవర్నర్ పదవి నుంచి ఆర్‌ఎన్‌ రవిని తొలగించి రాజ్యాంగం యొక్క విలువను, బాధ్యతను కాపాడాలని కోరారు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -