పరిస్ధితి దిగజారింది..సాముహిక వ్యాప్తి మొదలైంది!

189
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పరిస్ధితి దిగజారి…సామూహిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌(ఐఎంఏ) హెచ్చరించింది. మే 3 తర్వాత లాక్ డన్ సడలింపుల్లో భాగంగా ఆంక్షలను ఎత్తివేయడంతో వైరస్ పంజా విసిరిందన్నారు.

వచ్చే సెప్టెంబర్‌ మధ్య నాటికి వైరస్‌ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కే శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. మహమ్మారి కట్టడికి ప్రభు త్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు దేశంలో మొత్తం 10,38,716 కేసులు నమోదుకాగా 26,273 మంది మృతి చెందారు. దేశంలో ప్రతిరోజు సగటున 30వేల కేసులు నమోదవుతుండగా ఇప్పుడు గ్రామాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఐఎంఏ.

కరోనా కట్టడికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని…దేశ జనాభాలో 70 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురై.. సొంతంగా రోగనిరోధకవ్యవస్థను పెంపొందించుకొని దాని నుంచి బయటపడటం రెండోది వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం ద్వారా కరోనాను కట్టడిచేయవచ్చని ఐఎంఏ అభిప్రాయపడింది.

- Advertisement -