ఇండస్ట్రీ కొన్నిఫంక్షన్ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతుంటాయి. అందుకే చాలా మంది వేదికలపై ఆచి తూచి మాట్లాడుతుంటారు. కొందరు అనుకోకుండా నోరు జారి హీరో ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంటారు. తాజాగా కమెడియన్ శకలక శంకర్ కూడా అలాగే రవితేజ పై నోరు జరాడు. దీంతో రవితేజ ఫ్యాన్స్ రంగంలో దిగి అతన్ని రవితేజ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్రెండ్ చేశారు.
దీంతో కమెడియన్ శకలక శంకర్ కిందకి దిగి రవితేజ కి అపాలజీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. మేటర్ ఏంటంటే రవితేజ ధమాకా ఫంక్షన్ లో బండ్ల గణేష్ మెగా స్టార్ , సూపర్ స్టార్ లు ఈజీ గా అయిపోతారు అంటూ రవితేజ కి ఎలివేశన్ ఇచ్చే స్పీచ్ ఇచ్చాడు. ఆ విషయంలో చిరంజీవి , మహేష్ లను బండ్ల ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అందరూ అనుకున్నారు.
ఇటీవల వాల్తేరు వీరయ్య కి సంబందించి ఓ ఈవెంట్ లో బండ్ల కి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు శకలక శంకర్. నీ ముందు ఉన్న హీరో కోసం ఏది బడితే మాట్లాడితే ఎలా అంటూ పరోక్షంగా రవితేజ ను ఉద్దేశించి స్పీచ్ ఇచ్చాడు. దీంతో మాస్ మహారజా ఫ్యాన్స్ శకలక శంకర్ ను టార్గెట్ చేస్తూ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫైనల్ గా చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో రవితేజ అన్నా అంతే ఇష్టం అంటూ శకలక శంకర్ వీడియో ద్వారా రవితేజ కి అలాగే ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు.
ఇవి కూడా చదవండి..