సమంత కు అమ్మలా.. రష్మిక !

24
- Advertisement -

అగ్రకథానాయిక సమంత, రష్మిక మందన్నాలు మంచి స్నేహితులు. తాజాగా రష్మిక ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ సామ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి. ఛాన్స్ వస్తే.. ఒక అమ్మలాగా తనని నేను ఎప్పుడూ సంరక్షించాలనుకుంటున్నాని రష్మిక చెప్పుకొచ్చింది. అలాగే ఆమె ఇంకా మాట్లాడుతూ.. సామ్‌ మయోసైటిస్‌తో బాధపడుతోన్న విషయం తను ప్రకటించే వరకూ తనకు తెలియదని రష్మిక చెప్పింది. ఆ విషయం తెలిశాక, తాను చాలా బాధ పడిందట. సామ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాని రష్మీక మందన్నా కామెంట్స్ చేసింది.

ఇక సమంత ఆరోగ్యం విషయానికి వస్తే.. ఆమె వేగంగా కోలుకుంటోంది. పైగా ప్రస్తుతం సమంత పలు చిత్రాలతో బిజీగా ఉంటోంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడంతో ‘సిటడెల్’ అనే వెబ్ సిరీస్ నుంచి తప్పుకుందనే ప్రచారం జరిగింది. దీంతో, సమంత టీం స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని చెప్పింది. త్వరలో సామ్ షూటింగ్‌లో పాల్గొంటారని తెలిపింది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సామ్ నటించనున్నారు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకేనే దీనికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ హిందీ సిరీస్ తో పాటు సామ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ లు కూడా చేయనుంది. అలాగే కొన్ని బాలీవుడ్ చిత్రాలకు ఇప్పటికే సైన్ చేసింది. ఎలాగైనా మళ్ళీ స్టార్ హీరోయిన్ గా రాణించాలని సమంత ఆశ పడుతుంది. కాకపోతే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ గా సమంత కెరీర్ ఎక్కువ కాలం కొనసాగక పోవచ్చు. అయితే, ఒక నటిగా సమంత కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -