తాతగా బ్రహ్మానందంకి ప్రమోషన్..

286
Comedian Brahmanandam becomes grandfather
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు ప్రమోషన్ వచ్చింది. హనుమాన్ జయంతి రోజున తను తాతయ్యగా ప్రమోట్ అయ్యానని ఆయన తెలిపారు. సరిగ్గా హనుమాన్ జయంతి రోజు తన కుమారుడు గౌతమ్‌- జోత్స్న దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడని ఆయన చెప్పారు.

Comedian Brahmanandam becomes grandfather
తనకి మనవడు పుట్టడంపై బ్రహ్మానందం చాలా ఆనందం వ్యక్తం చేశారు. మనవడి రాక తన ఇంటిని సంతోషాల పొదరిల్లుగా మార్చిందని అన్నారు. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కి సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ కూతురు జ్యోత్స్నతో పెళ్లయ్యింది. గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అనంతరం బసంతి అనే సినిమాలోనూ నటించారు. ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

తాజాగా ఆయన ‘మను’ అనే చిత్రంలో చాందిని చౌదరితో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తైందని, వచ్చే నెలలో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

- Advertisement -