మొక్కలు నాటిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

319
gic
- Advertisement -

కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ విసిరిన గ్రీన్ చాలెంజ్ స్వీకరిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు కలెక్టర్ సి నారాయణ రెడ్డి. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తుందని, అనేకచోట్ల పచ్చదనం పెంపొందించే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు.

ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నట్లు, వారు ఒక్కరొక్కరు మూడు మొక్కలు నాటాలని కోరుతున్నానన్నారు. వనపర్తి, జగిత్యాల జిల్లా కలెక్టర్లకు ములుగు ఎస్పీ లకు తాను గ్రీన్ చాలెంజ్ విసిరినట్లు, వారిని ఒక్కోక్కరిని మూడు మొక్కలు నాటి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో హరిత హారం కార్యక్రమం అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేపట్టామని, నిజామాబాద్ జిల్లాలో సుమారు 82 లక్షల మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఏవో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -