బిడెన్ గెలుపు ఖాయం: హిల్లరీ క్లింటన్

172
hillari clinton

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీకి చెందిన హిల్లరీ క్లింటన్. ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ సందర్భంగా హిల్లరీ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ల చేరికపై గందరగోళం సృష్టించి చివర్లో కొద్ది మెజార్టీతో గెలిచేందుకు ప్రయత్నిస్తారని హిల్లరీ క్లింటన్ ఆరోపించారు.

కరోనా నేపథ్యంలో మెయిల్ ద్వారా పోలయ్యే ఓట్లు చేరేందుకు చాలా సమయం పడుతుందని, దీంతో బ్యాలెట్ల ఓటింగ్ కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశమున్నదని ఆమె అన్నారు. దీంతో ఫలితాలు వెల్లడి పూర్తయ్యేంత వరకు జో బిడెన్ ఓటమిని చివరి వరకు ఒప్పుకోకూడదని హిల్లరీ క్లింటన్ చెప్పారు.

2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ట్రంప్‌పై 30 లక్షలకుపైగా ఓట్లు సాధించినప్పటికీ రాష్ట్రాలవారీ ఎలక్టోరల్ కాలేజీ కౌంట్‌లో హిల్లరీ వెనుకబడిపోయారు.