ఈ కలెక్టరమ్మ.. 500 టికెట్లు కోనేసింది !

234
baahubali2
- Advertisement -

బాహుబలి టికెట్ల కోసం సగటుజీవి చేస్తున్న ప్రయత్నాలెన్నో. రోజుల దగ్గరపడుతున్నకొద్దీ బాహుబలి ఫీవర్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ మూవీని ఫస్ట్‌ షో చూద్దామనుకున్న ఎంతో మంది సినీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. టికెట్లను ఏదోలా సొంతం చేసుకోవటానికి ఎంతైనా పెట్టి కొనడానికి వెనకాడడం లేదు కొందరు. తాజాగా ఓ జిల్లా కలెక్టర్‌ ఏకంగా 500 టికెట్లను ముందే బుక్ చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. బెస్ట్ యంగ్ ఆడ్మినిస్ట్రేటర్‌గా గుర్తింపు పొంది… జిల్లా పాలనపై తనదైన ముద్ర వేస్తున్నఆమె ఎవరో కాదు.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి.

హన్ముకొండలోని ఏషియన్ వ్రీదేవి థియేటర్లలో ఆమె భారీ ఎత్తున టికెట్లను బుక్ చేసేసిన వైనం ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇంతకూ.. ఇన్ని వందల టికెట్లను కొనేసిన అమ్రపాలి.. ఎవరికి ఈ టికెట్లను ఇవ్వనుంది? ఎవరిని ఇన్వైట్ చేయనున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గత పదిహేను రోజులుగా వరంగల్‌ నగర సుందరీకరణ పనుల్లో తలమునకలై ఉన్న అధికారులకు వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

Why-Bahubali-Has-Changed-Telugu-Film-Industry-Forever-696x391

వారి కోసం బాహుబలి-2 సినిమాకి 350 టికెట్లను ఇప్పటికే బుక్‌ చేసి ఉంచారు. నగర సుందరీకరణ పనుల్లో తలమునకలైఉన్న 200 మంది అధికారులు, ఉద్యోగులు, 100 మంది ఆర్టిస్టులకు ఈ సినిమా చూపించనున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు బాహుబలి టికెట్లను వరంగల్‌ ఆర్డీవో ద్వారా బుక్‌ చేయించినట్టు తెలుస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రమే కాదు.. మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు తెలుగు ప్రేక్షకుడే కాదు.. అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు బాహుబలి 2 కోసం. దాదాపు 8 వేల థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యుల నుంచి వీవీఐపీ సెలబ్రిటీల వరకూ బాహుబలి క్రేజ్ ఊపేస్తోందనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

- Advertisement -