‘కోల్డ్ వాటర్’ థెరఫీ.. ఉపయోగాలు తెలుసా?

13
- Advertisement -

వేసవిలో చాలమందికి ముఖం పాలిపోవడం, లేదా ఉబ్బరంగా మారడం జరుగుతుంది. అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరఫీ అధ్బుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కోల్డ్ వాటర్ థెరఫీ అంటే ఉదయం నిద్ర లేవగానే చల్లనినీటితో ముఖాన్ని కడుక్కోవడం లేదా మొఖానికి ఐస్ ప్యాక్ చేసుకోవడం. ఇలా చేయడం వల్ల మొఖంపై రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తద్వారా ముఖంపై వచ్చే ముడతలు రాకుండా ఉంటాయి. ఇంకా ముఖంపై మంగు మచ్చలు రాకుండా కూడా ఈ కోల్డ్ వాటర్ థెరఫీ ఉపయోగ పడుతుందట. ఇంకా వేసవిలో చాలమంది మొఖం రంగు మారుతుంది. ఎందుకంటే విపరీతమైన ఎండ కారణంగా రంగు పాలిపోవడం వల్ల అందహీనత ఏర్పడుతుంది. .

ఈ సమస్యకు కూడా కోల్డ్ థెరఫీ అద్బుతంగా పని చేస్తుందని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చల్లని నీరు చర్మానికి తగిలినప్పుడు మొఖం లేదా చర్మంపై కణాలు యాక్టివ్ గా మారతాయి. తద్వారా మొఖం కాంతి వంతంగా మారుతుంది. ఇంకా డిప్రెషన్, ఆందోళన వంటి రుగ్మతలతో బాధ పడుతున్నవారు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మైండ్ రిలాక్స్ మోడ్ లోకి వస్తుంది. ఇంకా అలసట అధికమైనప్పుడు, బద్దకంగా అనిపించినప్పుడు కూడా ఈ కోల్డ్ థెరఫీ ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వేసవిలో నైనా ఇతర సీజన్స్ లోనైనా కోల్డ్ థెరఫీ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

కోల్డ్ థెరఫీ చేయు విధానం

చల్లటి నీటిని ఒక గిన్నెలో తీసుకొని 10-15 సెకన్ల పాటు ఆ గిన్నెలో ముఖాన్ని ముంచి తీయాలి. ఆ తర్వాత మెత్తటి తువాల్ తో మొఖం శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండు చేయవచ్చు. ఇలా కాకుండా చల్లటి నీటితో ఫేస్ ను శుభ్రం చేసుకోవడాన్ని కూడా కోల్డ్ థెరఫీనే అంటారు.

Also Read:TTD:సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు

- Advertisement -