తొలి కాక్లియ‌ర్ ఇంప్లాంట్ స‌ర్జ‌రీ సక్సెస్..

45
hospital
- Advertisement -

గాంధీలో తొలి కాక్లియ‌ర్ ఇంప్లాంట్ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంది. వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న ఓ మూడేండ్ల చిన్నారికి గాంధీ వైద్యులు కాక్లియ‌ర్ ఇంప్లాంట్ స‌ర్జ‌రీ సక్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి డాక్టర్ల బృందానికి మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 15 లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్స ఉచితంగా జరిగిందని తెలిపారు.

కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, ఇది అంతర్గత, బాహ్య భాగాలను కలిగి ఉంటుంది. పరికరం ధ్వని యొక్క స్పర్శను అందించడానికి కాక్లియర్ నాడిని (వినికిడి సంబంధిత) ప్రేరేపిస్తుంది. ప్రత్యేకమైన ఇంప్లాంట్ శస్త్రచికిత్స సరిగా వినడానికి సహాయపడుతుంది.

- Advertisement -