శ్రీశైలం విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ప్రభాకర్ రావు..

339
cmd prabhakar rao
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు తెలంగాణ విద్యుత్ సౌధ జెన్కో మరియు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌ రావు.ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిశీలించారు.

హైడల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో గత సంవత్సరం అగ్రగామిగా నిలిచిన శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పనితీరును అభినందించారు సిఎండి ప్రభాకర్‌రావు.పవర్ గ్రిడ్ డిమాండ్ కు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా 4500 మిలియన్ యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ ఉత్పత్తిని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని అధికారులకు సూచనలు చేశారు.

భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రధానమైన మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, A & C, మరియు మాస్టర్ కంట్రోల్ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్న సిఎండి ప్రభాకర్ రావు .విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని అణువణువు పరిశీలించి జీరో లెవల్ నుండి సర్వీస్ బే వరకు కాలినడకతో తిరుగుతూ కీలక మరమ్మతులను గుర్తించారు ప్రభాకర్ రావు.

విద్యుత్ ఉత్పత్తి చేయటంలో నిమగ్నమైన కార్మికులు సిబ్బందితో పాటు వారి కుటుంబాలను కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉందని హెచ్చరించారు.

- Advertisement -