ఫిబ్రవరి నెల్లో లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని సీఎం యోగి అదిత్యనాథ్ సూచించారు. ముంబైలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబై వచ్చిన యోగి… ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో దాడులకు పాల్పడేందుకు గుండాలు లేరని భరోసా నిచ్చారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ చాలా భద్రంగా ఉందని తెలిపారు.
2017కి ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. గతంలో ప్రతి రోజు రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరుగుతుండేవని, శాంతి భద్రతలు సరిగా ఉండేవి కావని అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతిభద్రతలు అమలులో ఉన్నాయి. మీపై (పెట్టుబడిదారులు) గూండాలు ఎవరూ దాడులు చేయరు. అలాగే మీ నుంచి టాక్సులు వసూలు చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి ఉండవు. ప్రభుత్వం 64,000 ఎకరాలను పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించింది అని యోగి అన్నారు.
ఫిబ్రవరి 10-12ల మధ్య లక్నో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీసుకురావాలని సీఎం యోగి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సహచర మంత్రులు అధికారుల బృందంతో ముంబై పర్యటనకు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో దేశియ పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం స్వయంగా సీఎం యోగి రంగంలోకి దిగారు. అందుకు కావాల్సిన విధంగా వివిధ కార్యచరణలను రూపొందించారు.
ఇవి కూడా చదవండి…