తమిళనాట మంటరేపిన గవర్నర్‌…

157
- Advertisement -

తమిళనాడు గవర్నర్‌ తమిళనాట అగ్గిరాజేశారు. తమిళనాడును తమిళగంగా మార్చాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అన్నారు. దీనిపై ప్రజలు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు ద్రవిడ రాజకీయాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డీఎంకేతో పాటు అన్ని రాజకీయా పక్షాలు గవర్నర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట ప్రజలు ఏకంగా సోషల్‌ మీడియా ద్వారా మండిపడుతున్నారు.

దురదృష్టవశాత్తు తమిళనాడులో తిరోగమన రాజకీయాలు ఉన్నాయి, మనం ద్రావిడులం, దీనితో (భారత్) మాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న కొన్ని అబద్ధాలు, కల్పితాలను చెరిపేయాలి. తమిళనాడు దేశానికి ఆత్మ, ప్రత్యేక ఆలోచన, గుర్తింపు. ఇక్కడ తిరోగమన రాజకీయాలు ఎక్కువయ్యాయి. దేశంలో రాష్ట్రం అంతర్భాగం కాదని చెబుతూ, తమ ప్రయోజనాల కోసం విద్యావేత్తలతో సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజంన చేకూర్చే ప్రతిదాన్ని గుడ్డిగా తిరస్కరించే అలవాటు పెరిగింది అని బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రవి అన్నారు.

గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే ఏఐడీఎంకే సహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నెట్టింట్లో మాత్రం తమిళనాడు అంటే ప్రత్యేక అస్తిత్వం కలిగిన దేశమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ట్విటర్‌లో #tamilnadu అనే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నడుస్తోంది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ద్రావిడ పార్టీల సభ్యులు మద్దతుదారులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ ఉపయోగిస్తూ ట్విట్టర్‌ ద్వారా మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

భారతదేశానికి దిక్సూచి తెలంగాణ:కేటీఆర్‌

ఢిల్లీ మేయర్‌కై కొట్లాట…

కాంగ్రెస్‌కు షాక్.. బి‌ఆర్‌ఎస్ లోకి 12 మంది!

- Advertisement -