Revanth Reddy:కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

40
- Advertisement -

హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్‌తో మాట్లాడారు రేవంత్.

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని… అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని చెప్పారు రేవంత్. వారి సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని …కేసీఆర్‌ కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. కాగా కేసీఆర్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్‌ అలీ కూడా ఉన్నారు. వారి కంటే ముందు మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా సీఎంను పరామర్శించి వెళ్లారు.

Also Read:నాగ చైతన్య @ ‘తండేల్’

- Advertisement -