త్వరలోనే ప్రధానిని కలుస్తాం:సీఎం రేవంత్

8
- Advertisement -

కేంద్ర బడ్జెట్ నుండి తెలంగాణకు ఎక్కువ నిధులు తేవాలనే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలు ముగిసిపోయాయని, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణకు ఎక్కువ నిధులు తేవాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రధాని, అమిత్ షాను కలుస్తామని వెల్లడించారు. జగిత్యాల అభివృద్ధి కోసం అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారని, జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని వెల్లడించారు.

తన పదవీ కాలం పూర్తయ్యేలోపు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరామని… సామాజిక న్యాయంతో పాటు సమర్థుడైన నాయకుడిని హైకమాండ్ ఎంపిక చేస్తుందని చెప్పారు.

Also Read:దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచాం:ముర్ము

- Advertisement -