కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం

5
- Advertisement -

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ కనకరాజు కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను ఆదేశించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. అరుదైన కళాకారుడు కనకరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఏం రేవంత్ …కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆదివాసీ జీవన విధానంలో విశిష్టతను సంతరించుకున్న సాంస్కృతిక కళారూపం గుస్సాడి నృత్య అభ్యున్నతికి తన జీవితకాలం కృషి చేసిన కనకరాజు మరణం, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వికాసానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు.

పద్మశ్రీ కనకరాజు చేసిన కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని తగురీతిలో ప్రోత్సహించి సత్కరించిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Also Read:అక్కినేని శతజయంతి..చిరుకు ఆహ్వానం

- Advertisement -