ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం ఒమర్ అబ్దుల్లా

3
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్ చేశారు. యూపీఏ కూటమిలో ఉండి కూడా ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల ఇలాంటి పలితాలు వచ్చాయని తెలిపారు. ఓటు షేర్ చీలిపోయి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్ లోకి వెళ్లిందని తెలిపారు.

26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 36 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో దూసుకుపోతోంది బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతుండటం గమనార్హం. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ 26 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

బీజేపీ ఆఫీస్‌లో సంబరాలు మొదలుకాగా ఆప్ ఇంకా ఆశాభావంతోనే ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేదు.

Also Read:Delhi Elections:ఢిల్లీలో కమల వికాసం

 

- Advertisement -