Delhi Elections:ఢిల్లీలో కమల వికాసం

18
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.1998 అంటే 26 ఏళ్ల తర్వాత తిరిగి ఢిల్లీ పీఠంపై కమల వికాసం కనిపిస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ పూర్తవగా 19 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. బీజేపీ 42 స్థానాల్లో ఆప్ 28 స్థానాల్లో ముందంజలో ఉంది.

న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజలో ఉండగా సీఎం ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి ఆధిక్యంలో ఉన్నారు. జంగ్‌పురలో ఆప్‌ అభ్యర్థి సిసోడియా ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఆప్ అభ్యర్థులు సోమ్‌నాథ్‌ భారతి మాల్వియా నగర్‌లో, సౌరభ్‌ భరద్వాజ్‌ గ్రేట్‌ కైలాశ్‌లో, గోపాల్‌ రాయ్‌ బాబర్‌పుర్‌లో ముందంజలో ఉన్నారు.

ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజలో ఉండగా గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ,బిజ్వాసన్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజలో ఉన్నారు.

Also Read:తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే!

- Advertisement -