డిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించాను అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన బండి.. డిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారు… ప్రజలు అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారు అన్నారు.
మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారు.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
న్యూఢిల్లీ స్థానంలో మొదట వెనుకంజలో కొనసాగిన కేజ్రీవాల్ ప్రస్తుతం ముందంజలోకి వచ్చారు. ఇప్పుడు 343 ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగుతున్నారు.
ఢిల్లీలో ఆప్ వెనుకంజలో ఉండడంతో ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ చెప్పిన అసత్యాలను ఎవరూ నమ్మలేదని అన్నారు. ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలు ఇలాగే ఓడిస్తారని చెప్పారు. ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Also Read:Delhi Elections:ఢిల్లీలో కమల వికాసం

