సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌అంబేద్కర్‌..

40
- Advertisement -

బాబా సాహెబ్‌ అంబేద్కర్ 125అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన  ప్రకాశ్‌ అంబేద్కర్‌ సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతిభవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్‌ ఇతర నాయకులతో కలిసి ముచ్చటించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ శాలువతో ఘనంగా సత్కరించి పూలగుచ్చమందించారు. అనంతరం కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మధుసూదనచారి, దేశపతి శ్రీనివాస్‌, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్‌, శంకర్‌ ధోంగే, తదితర నాయకులు వెంట ఉన్నారు. మరికాసేపట్లో ప్రకాశ్ అంబేద్కర్‌ తోడ్కొని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో కలిసి బయలుదేరనున్నారు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన జేడీ

KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు

బీజేపీలోకి కాంగ్రెస్ మహేశ్వర్ రెడ్డి

- Advertisement -