వార్‌ వన్‌సైడే..హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ!

116
trs
- Advertisement -

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. పోలింగ్‌కు మరో 20 రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రులు హరీష్‌రావు, కొప్పుల, గంగుల కమలాకర్‌తో పాటు బాల్కసుమన్, సుంకె రవి, ఆరూరి రమేష్ వంటి దళిత ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గమంతటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాగా మరోవైపు బీజేపీ నేత ఉన్న కొద్దిపాటి అనుచరులు, కాషాయ క్యాడర‌తో కలిసి క్యాంపెయిన్ చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఈసీ కఠిన నిబంధనలు అమలు చేయడంతో ఈసారి ప్రధాన పార్టీలకు పెద్ద చిక్కే వచ్చిపడింది. హుజురాబాద్‌లో స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. బహిరంగ సభలో వెయ్యి మందికి మించరాదని, రోడ్ షోలు, ర్యాలీలు కూడా చేపట్టకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. దీంతో ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ అగ్రనేతల భారీ బహిరంగ సభలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే తొలుత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కోడ్ ఉంటుందని చెప్పిన ఈసీ ఆ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గానికే కోడ్ అమల్లో ఉంటుందని ప్రకటించడంతో రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికే కోడ్ వర్తించడం ప్రధాన రాజకీయ పార్టీలకు వరంగా మారింది.ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ సమీపంలోని హుస్నాబాద్‌లో తన పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాడు. తాజాగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ ఏర్పాటుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా, హుజురాబాద్‌‌కు దగ్గరగా ఉండే పెంచికల్ పేట్ గ్రామం వేదికగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మురం చేస్తోంది.

నూతనంగా ఆవిర్భవించిన హనుమకొండ జిల్లాలో ఈ గ్రామం చేరడంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండడం, అదీ కరీంనగర్, వరంగల్ హైవేలో హుజురాబాద్‌కు దగ్గరగా ఉండడంతో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఫిక్స్ అయిందంట..ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో చర్చించి భారీ బహిరంగసభ వేదికను, తేదీని డిసైడ్ చేసేందుకు మంత్రి హరీష్‌రావు రెడీ అవుతున్నరంట..మరోవైపు మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని శంకరపట్నం మండలం కూడా హుజురాబాద్‌ పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది…ఈ మండలంలోని సరిహద్దు గ్రామాల్లో కూడా ప్రచారానికి అనువైన పరిస్థితులు ఉన్నాయంట…మొత్తంగా దసరా పండుగ తర్వాత సరిగ్గా ఎన్నికలకు వారం, పది రోజులకు ముందు సీఎం కసీఆర్ భారీ బహిరంగ సభ జరగడం ఖాయమంటూ వస్తున్న వార్తలతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చెప్పాలి. సీఎం కేసీఆర్ ఎంట్రీతో హుజురాబాద్‌లో వార్ వన్‌సైడ్‌గా మారుతుందని . ఈటల ఓడిపోవడం ఖాయమని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తేన్నాయి.

- Advertisement -