తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేసీఆర్‌ ముందడుగు..

255
- Advertisement -

సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా కలిసామని.. రెండు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహ బంధం బలపడిందని వైసీపీ నేత,ఏపీ కాబోయే సీఎం పైయస్‌ జగన్‌ తెలిపారు. నేడు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

పోరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి, అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రం తెలంగాణతో స్నేహ బంధం అవసరమని జగన్‌ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తానే ఒక అడుగు ముందుకేసి మాకు సహకరిస్తామని హామి ఇచ్చారు. విభజన చట్టంలోని హామిలను కలిసి సాధిద్దామని పెద్దాయన(సిఎం కేసీఆర్) ముందుకు వచ్చారు.

KCR

ప్రత్యేక హోదాపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన స్పష్టం చేశారని జగన్‌ పేర్కొన్నారు. ఏపిలో 22, తెలంగాణ 9, మొత్తం 31మంది ఎంపీలం ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరం సీఎం లం కలిసి పని చేస్తాం అని కాబోయే ఏపి సీఎం జగన్ తెలిపారు.

- Advertisement -