నాగర్‌ కర్నూల్ ప్రజలకు రుణపడి ఉంటా.. ఎంపి రాములు

176
Pothuganti Ramulu

పార్లమెంటు సభ్యుడిగా కావాల్సిన నియామక పత్రాలను లోక్ సభ సెక్రటేరియట్‌లో సమర్పించారు నాగర్ కర్నూల్ ఎంపి రాములు. లోక్ సభ సెక్రటేరియట్ నూతన ఎంపీల కోసం మంచి ఏర్పాట్లు చేసింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఏయిర్ పోర్ట్ నుంచి పార్లమెంట్ వరకు వాహన సౌకర్యాలు కల్పించారు. ఐడి కార్డు, పార్లమెంటు సంబంధించిన సమాచార ప్రతుల్ని అందించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉంది అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపిగా నియోజక వర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా.. భారీ మెజార్టీతో గెలిపించిన నాగర్‌ కర్నూల్ ప్రజలకు రుణపడి ఉంటా అని నాగర్‌కర్నూల్ ఎంపి పి రాములు తెలిపారు.