భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..

14
- Advertisement -

మహారాష్ట్ర లోని సోలాపూర్ పర్యటనకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట భారీగా తరలింది కాన్వాయ్. దాదాపు 600 వాహనాలతో కూడిన కాన్వాయ్ లో సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

మధ్యాహ్నం 1 గంటకు ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకుచేరుకొంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్‌ బయలుదేరుతారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్‌ నుంచి పండరీపురం చేరుకుంటారు. విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Also Read:11వ విడత రైతుబంధు పంపిణీ..

తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్‌ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు.

Also Read:వర్షాకాలంలో వచ్చే అలెర్జీలకు వీటితో చెక్.. !

- Advertisement -